6 వేల ఎకరాల్లో పంట నష్టం: ఎంపీ

6 వేల ఎకరాల్లో పంట నష్టం: ఎంపీ

MDK: అకాల వర్షంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో సుమారు 6 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చేగుంట, నార్సింగి, మాసాయిపేట మండలాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని, రాష్ట్రంలో 'ఫసల్ బీమా' యోజన అమలు చేస్తే రైతులకు మేలు జరిగేదన్నారు.