ఆధార్ క్యాంపును సందర్శించిన ఎంపీడీవో

ఆధార్ క్యాంపును సందర్శించిన ఎంపీడీవో

NLR: విడవలూరు మండలంలోని గాదేలదిన్నె గ్రామ సచివాలయంలో బుధవారం ప్రత్యేక ఆధార్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో నగేష్ కుమారి ఆధార్ క్యాంపును సందర్శించారు. అనంతరం సచివాలయం సిబ్బందికి పలు సూచనలు చేశారు. నూతన ఆధార్ కార్డుల నమోదు, ఆధార్ అప్డేట్, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు.