కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా బాధాకరం: ఎర్రబెల్లి

MHBD: కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 'కొండా సురేఖ వెనుక ఉండి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని తెలిపారు. హైడ్రా నుంచి దృష్టి మరల్చే యత్నమే ఇది, సినీ తారలను కించపరచడం శోచనీయమని చెప్పారు. వారికి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని దయాకర్ రావు వ్యాఖ్యానించారు.