VIDEO: ఆటో నుంచి జారిపడి చిన్నారి మృతి

NRPT: జిల్లాలోని కృష్ణ మండలం టై రోడ్డులో బుధవారం జరిగిన ప్రమాదంలో 16 ఏళ్ల నందిని ప్రాణాలు కోల్పోయింది. మల్లేపల్లి గ్రామానికి చెందిన నందిని కుటుంబంతో కలిసి కడచూరు వెళ్లి ప్యాసింజర్ ఆటోలో తిరిగి వస్తుండగా, మార్గంలో ఆటో నుంచి జారి పడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమెను ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.