విమాన ప్రయాణికులకు కేంద్రం GOOD NEWS
అంతర్జాతీయ చమురు సంక్షోభం కారణంగా ఇవాళ్టి నుంచి విమాన ఇంధన(ATF) ధరలు 100% పెరుగుతాయని భావించినా, కేంద్రం ఊరటనిచ్చింది. దేశీయ విమాన సర్వీసులకు కేవలం 25%(లీటరుకు రూ.15) మాత్రమే పెంచాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీనివల్ల విమాన ఛార్జీల భారం తగ్గడమే కాక, ఏవియేషన్ రంగం నిలకడగా ఉంటుందని.. కార్గో రవాణాకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.