అల్లవరంలో ఎంఎల్‌హెచ్‌పీ నిర్లక్ష్యం
కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఎంఎల్‌హెచ్‌పీ నిర్లక్ష్యం వెలుగుచూసింది. మంగళవారం ఒక మహిళ కుక్క కరిచిందని ఎంఎల్‌హెచ్‌పీకి ఫోన్ చేస్తే నాలుగోసారి లిఫ్ట్ చేసి నువ్వేమైనా సీఎంవా, నువ్వు ఫోన్ చేయగానే ఎత్తేయడానికి అని ఎంఎల్‌హెచ్‌పీ విజయ అనడంతో ఆమె అవాక్కయింది. స్థానికులు ఆమెను అల్లవరం ఆసుపత్రికి తరలించారు.