అలంపూర్‌లో గొర్రెలు మృతి.. రైతు ఆందోళన
GDWL: అలంపూర్ మండల కేంద్రానికి చెందిన కురువ వెంకటేష్ అనే గొర్రెల కాపరి రైతు పొలంలో ఆపిన గొర్రెల మందపై రాత్రి కురిసిన వర్షం ప్రభావం చూపింది. ఈ వర్షం కారణంగా శనివారం ఉదయం 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఆరుగాలం కష్టాన్ని కోల్పోయిన వెంకటేష్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.