'జగన్‌కు మంత్రి పదవి ఇవ్వాలి'

'జగన్‌కు మంత్రి పదవి ఇవ్వాలి'

ELR: ఏపీ కూటమి ప్రభుత్వంలో జగన్‌కి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోళ్ళ పవన్ కుమార్ వినూత్నంగా డిమాండ్ చేశారు. నూజివీడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూటమి ప్రభుత్వం నిలిపిన అభ్యర్థికి వైసీపీ ఎంపీలు ఓటు వేయాలని జగన్ చెప్పడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. జగన్ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.