నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
AP: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ఏ1, ఏ2 నిందితులు జనార్ధన్ రావు, జగన్ మోహన్‌ను 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు సూచనలు చేసింది. ఇప్పటికే పోలీసులు ఓసారి కస్టడీకి తీసుకుని విచారించారు. మరింత లోతు దర్యాప్తు నేపథ్యంలో మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. అనుమతి ఇస్తూ ఆదేశించింది. కాగా, వారిద్దరూ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.