వసతి గృహంలోకి వరద నీరు.. భయంతో విద్యార్థినిలు
RR: మహేశ్వరంలోని కస్తూరి గాంధీ బాలికల వసతి గృహంలోకి వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రామచంద్రగూడ చెరువు గండి పడటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 400కు పైగా బాలికలు భయపడుతుండగా, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు సహాయం చర్యలను చేపట్టాలన్నారు.