'హమాలీ గర్జన పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే'
PDPL: హనుమకొండలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన హమాలీ మహా గర్జన పోస్టర్‌ను ఎమ్మెల్యే విజయ రమణారావు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని హమాలీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య పాల్గొన్నారు.