VIDEO: ఆకివీడు బ్యాంకులో రూ. కోటి గోల్ మాల్
W.G: ఆకివీడు యూనియన్ బ్యాంకు నిండా జనమే. ఏదో డబ్బులు తీయడానికో? వేయడానికో అనుకునేరు. ఆకివీడు డ్వాక్రా సంఘాల యానిమేటర్ సుధ రూ. కోటి మేర సొమ్ము స్వాహా చేయడంతో మహిళలు వెళ్లి స్టేట్‌మెంట్ తీయించుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.