బ్రేకప్ నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది: హీరో
బ్రేకప్ గురించి హీరో అడవి శేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'నాకు బ్రేకప్ కథలంటే చాలా ఇష్టం. నా జీవితంలోనూ అలాంటి బ్రేకప్ కథలున్నాయి. 19ఏళ్ల వయసులో తొలిసారి ప్రేమలో విఫలమైనప్పుడు నాకేం అర్థం కాలేదు. దాని నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. నేను రాసే ప్రతి కథలోనూ నా బ్రేకప్స్ ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు.