'పది' పరీక్షలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల పరీక్షా కేంద్రాన్నిఆకస్మికంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు.