నేడు కడప జిల్లాకి వర్ష సూచన!
KDP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దీని ప్రభావంతో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.