VIDEO: మహానంది పరిసరాలను వదలని చిరుత పులి

VIDEO: మహానంది పరిసరాలను వదలని చిరుత పులి

NDL: మహానంది ఆలయ పరిసరాలను చిరుత పులి వదలడం లేదు. తాజాగా శనివారం తెల్లవారుజామున మహానందిలోని గోశాల పరిసరాల్లో చిరుత పులి సంచరించడం కలకలం రేపింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో చిరుత పులి కనిపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అటవీశాఖ అధికారులు స్పందించి ఇప్పటికైనా చిరుత పులిని బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.