VIDEO: గ్రామాల సుస్థిర అభివృద్ధే లక్ష్యం: ఎంపీడీవో
NLR: వింజమూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన గ్రామాల సుస్థిర అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయం, వెలుగు సిబ్బందికి పేదరిక నిర్మూలన, గ్రామాల అభివృద్ధిపై సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2030 మార్చినాటికి గ్రామాలు సుస్థిర అభివృద్ధి వైపు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాయని తెలిపారు.