'కేజీహెచ్‌లో మహిళ మృతి దారుణం'
VSP: కేజీహెచ్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మహిళ మృతి చెందడం దారుణాతి దారుణమని వైసీపీ నేత కొండా రాజీవ్‌గాంధీ ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి చులకన అన్నారు. గురువారం విద్యుత్ సరఫరా లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.