'నిందితులను కఠినంగా శిక్షించాలి'
SKLM: ఆమదాలవలసలోని బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద గురువారం న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన న్యాయవాది పూజారి ఎర్లయ్య హత్యను ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.