మేడారంలో పర్యటించనున్న సీఎం: మంత్రి

MLG: మేడారంలో జరగనున్న పనులను పరిశీలించడానికి వారంలోగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర పండగనే కాకుండా మరో కుంభమేళా తరహాలో జరగనున్న జాతరకు సామాన్య పౌరుడి నుంచి రాష్ట్రపతి, ప్రధాని లాంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. వీవీఐపీలకు ఇబ్బందులు రాకుండా విమానాలు సైతం మేడారంలో దిగే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.