వేదవతి నదిపై వంతెనకు భూమిపూజ
ATP: బ్రహ్మసముద్రం(M) కన్నెపల్లి వద్ద వేదవతి నదిపై వంతెన, తారు రోడ్డు నిర్మాణానికి MLA అమిలినేని సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. నాబార్డు ద్వారా రూ.30 కోట్లతో మంజూరైన ఈ పనులను ఏడాదిన్నరలోపు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఉన్న ఈ కలను సాకారం చేసినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.