రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు పునరుద్ధరణ

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా విశాఖపట్టణం-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును రద్దు చేయగా ఇప్పుడు పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అలాగే పలాస-విశాఖపట్నం(67290) మెము రైలును విశాఖపట్నం వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస మీదుగా నడుస్తాయి.