ప్రత్యేక అలంకరణలో గంగాలమ్మ

W.G: నరసాపురం మండలం లింగనబోయిన చర్ల గ్రామంలో వెలసిన గంగాలమ్మ అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. దర్శనానికై చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి చలిమిడి, నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.