ఎకో టూరిజం హబ్ చేస్తాం: కొండా సురేఖ

ఎకో టూరిజం హబ్ చేస్తాం: కొండా సురేఖ

TG: తెలంగాణను ఎకో టూరిజం హబ్ చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. నర్సాపూర్ అడవుల్లో ఎకో పార్క్, కాటేజీలను మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం పట్టణీకరణ పేరుతో పెరిగిన కాలుష్యం కారణంగా.. ప్రజలంతా మళ్లీ అడవుల వైపు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వం అర్బన్ ఎకో పార్కులను అభివృద్ధి చేస్తోందన్నారు.