పండ్ల తోటలకు 100% రాయితీ

NDL: ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగు ప్రోత్సాహంలో భాగంగా ఉపాధి హామీ పనుల కింద 100% రాయితీ కల్పిస్తున్నట్లు చాగలమర్రి మండల ఏపీవో ఖాసీం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మామిడి, నేరేడు, కొబ్బరి, నిమ్మ, సపోటా, బత్తాయి తదితర 18 రకాల పంటలకు ప్రభుత్వం 100% రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.