'దివ్యాంగుల ఓట్లను ఇంటివద్ద తీసుకోవాలి'
MNCL: దివ్యాంగుల ఓట్లను అధికారులు ఇంటి వద్దనే తీసుకోవాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. ఆదివారం జన్నారంలో మహిళా కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని చాలా గ్రామాలలో కదలలేని దివ్యాంగులు ఉన్నారని, వారికి ఓటు హక్కు ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి దివ్యాంగుల ఓటును తీసుకున్నారని తెలిపారు.