'అంబటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం'
VSP: సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను విశాఖ జనసేన సీనియర్ నాయకులు రాజు గౌడ్ యాత తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విధానాలపై విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలకు స్థానం లేదని అన్నారు. చంద్రబాబును కించపరచడం తెలుగు ప్రజల ఆత్మగౌరవంపై దాడితో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు.