కుటుంబంతో కలసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కుటుంబంతో కలసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండలం బండమీదపల్లిలో జరిగిన సల్లాపురం పార్వేట ఉత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సల్లాపురమ్మ అమ్మవారికి ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నసనకోటలోని ముత్యాలమ్మ ఆలయాన్ని కూడా సందర్శించి కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.