బహుజన కులాల ఆశాజ్యోతి సర్దార్
MDK: బహుజన కులాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రామాయంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు కన్నాపురం కృష్ణా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.