నాలుగో రోజు పార్లమెంట్.. కాలుష్యంపై విపక్షాల పోరు!
పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. వాయు కాలుష్యంపై విపక్షాలు ఆందోళన తీవ్రం చేశాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌లో 'ఇండి' కూటమి నేతలు భేటీ కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. కాలుష్యం, ఇతర ప్రజా సమస్యలపై పోరాటం కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు.