రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

కోనసీమ: అంబేడ్కర్ కోనసీమ రైతాంగం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద వ్యవసాయ మిషన్ అమలుపై అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.