మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీగా భద్రత :జిల్లా ఎస్పీ
నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా 1680 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 442 సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పర్యవేక్షణ చేపట్టారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లలో 1141 మందిని బైండోవర్ చేసి కదలికలపై నిఘా ఉంచుతున్నామని చెప్పారు. పోలింగ్ 100 మీటర్ల పరిధిలో గుంపులుగా నిషేధం అని తెలిపారు.