ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

E.G: అనపర్తి మండలం రామవరంలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన మండ అబ్బాయి రెడ్డి, మండ సతీష్ రెడ్డిలు ఎమ్మెల్యేగా నల్లమిల్లి గెలవాలని మొక్క కున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టి వారి మొక్కను చెల్లించారు.