గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆహ్వానం
WNP: పెబ్బేరు పట్టణంలోని మహా భూపాల్ చెరువు సమీపాన నూతనంగా నిర్మించిన మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో ఈ నెల10 నుంచి 12 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మత్స్య సహకార సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.