'జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి'

ATP: రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. దాదాపు 12 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3న నిర్వహించనున్న జాబ్ మేలాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.