హనుమాన్ జంక్షన్‌లో హీరో సుమన్

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణిని ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ కలిశారు. కుటుంబ సమేతంగా సాయి కళ్యాణి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా స్నేహపూర్వకంగా సంభాషణలు జరిపి సంతోషం వ్యక్తం చేశారు.