'పొట్టిశ్రీరాములు మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం'

SKLM: నగర అభివృద్ధిలో భాగంగా పొట్టి శ్రీరాములు మార్కెట్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో నగరంలోని మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు. అమ్మకందారులు, వినియోగదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.