ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ పంపిణీ
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నేడు రామాయంపేట మండల కేంద్రంలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన ప్రోసీడింగ్స్ అందజేస్తారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులందరూ సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో షాజలుద్దీన్, మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తెలిపారు.