VIDEO: 'రోడ్డుపై పశువుల సంచారంతో ఇబ్బందులు'

ASR: అనంతగిరి మండలంలోని కాశీపట్నం ప్రధాన రహదారిపై రాత్రి వేళలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యజమానుల ఇంటి వద్దే పశువులను కట్టేసుకోవాలని పంచాయతీ సిబ్బంది ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేశారు. అయినా పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.