మినగల్లు మురికి నీరు తాగేదెలా..?
NLR: బుచ్చి మండలం మినగల్లు గ్రామంలో పంచాయితీ కుళాయిలలో మురికి నీరు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుడు ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ.. కుళాయిల్లో వస్తున్న మురికి నీరు తాగితే అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డ్రైనేజీ నీరు రోడ్లపై చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.