విశాఖ జూలో 12 ఏళ్ల ఎలుగుబంటి మృతి
VSP: విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులోని 12 ఏళ్ల ఆడ ఎలుగుబంటి (స్లాత్ బేర్) అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. ఇది గర్భం దాల్చి, ఇటీవల గర్భస్రావానికి గురైందని జూ క్యూరేటర్ జీ. మంగమ్మ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, గర్భాశయంలో మిగిలిన పిండం, ఇతర భాగాల వల్ల ఏర్పడిన 'సెప్టిసిమియా' (సెప్సిస్) వ్యాధి కారణంగానే మరణం సంభవించినట్లు నిర్ధారించారు.