రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

ఏలూరు: కైకలూరులో శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఏ టూ జెడ్ ఆక్వా రైతు బజార్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.