VIDEO: ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాం: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రాము బుధవారం మాట్లాడారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశ బలగాలు చేసిన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ అయిందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, టెక్నాలజీతో ఉగ్రవాద సంస్థలకి సరైన సమాధానం ఇచ్చిందని తెలిపారు. భారతదేశ మిలటరీ పవర్ గురించి ఈ సంఘటన ద్వారా ఉగ్రవాదులకు తెలుస్తుందన్నారు.