విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

అన్నమయ్య: కోడూరు మండలం సెట్టిగుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోడూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన తేజ (26) అనే యువకుడు ప్రైవేట్ జ్యూస్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా బుధవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.