యువకుడు అనుమానస్పద మృతి
ప్రకాశం: చీమకుర్తిలోని గాంధీ నగర్‌లో రామయోగి అనే యువకుడు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. నిన్న చీమకుర్తిలో జరిగిన తిరుణాలకు వెళ్లిన రామయోగిని రాత్రి ముగ్గురు యువకులు ఇంటి వద్ద విడిచి వెళ్లారు. ఉదయం రామయోగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.