భద్రకాళి అమ్మవారికి లక్ష గన్నేరు పూలతో అభిషేకం
WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజు అమ్మవారికి లక్ష గన్నేరు పూలతో పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.