VIDEO: లక్షలాది మంది భక్తులకు చురుగ్గా వసతి ఏర్పాట్లు
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రశాంతి నిలయం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తుల కోసం పుట్టపర్తి వ్యాప్తంగా వసతి కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.