ఉపాధ్యాయ కొలువు సాధించిన పంచాయతీ కార్యదర్శి

ఉపాధ్యాయ కొలువు సాధించిన పంచాయతీ కార్యదర్శి

VZM: పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన ఉజూరు రాంబాబు మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ కొలువు సాధించారు. ఈయన 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం తెర్లాం మండలంలో పనిచేస్తున్నారు. టీచర్ ఉద్యోగంపై మక్కువతోనే చదివి ఉద్యోగం సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.