రోడ్డు గుంతలను పూడ్చి వేసిన గ్రామస్తులు

రోడ్డు గుంతలను పూడ్చి వేసిన గ్రామస్తులు

KMR: లింగంపేట మండలం ముంబాజిపేటలో రహదారి గుంతలమయం కావడంతో వడ్ల బస్తాలను తరలించే లారీలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైస్ మిల్లులకు వడ్లు తరలించడం కష్టంగా మారడంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. బుధవారం మట్టి తోలి ట్రాక్టర్ సహాయంతో రోడ్డును తాత్కాలికంగా బాగు చేశారు. ఇప్పటికైనా వడ్ల తరలింపు ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.