సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏమిటి?
అమెరికా వీసా దరఖాస్తుదారులకు 'సోషల్ మీడియా వెట్టింగ్' నిబంధనను ట్రంప్ ప్రభుత్వం మరిన్ని కేటగిరీలకు విస్తరించింది. మార్చి 30 నుంచి అమలుకానున్న ఈ రూల్ ప్రకారం దరఖాస్తుదారులు తమ SM ఖాతాలను పబ్లిక్‌లో ఉంచాలి. జాతీయ భద్రత దృష్ట్యా మీ ఆన్‌లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేస్తారు. మీ పోస్ట్‌ల వల్ల అమెరికాకు ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే వీసా మంజూరు చేస్తారు.